యదార్థ సంఘటనల ఆధారంగా

VISHWAMITRA
VISHWAMITRA

సోమవార ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా రాజకిరణ్‌ సినిమా పతాకంపైవిశ్వామిత్ర సినిమాను లాంభనంగాప్రారంభించారు. సినిమాకు మాధవి అదండి, రజనీకాంత్‌ ఎస్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గీతాంజలి, త్రిపుర చిత్రాల దర్శకుడు రాజకిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక నిర్మాతతేజ ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూజలు నిర్వహించి చిత్ర పటంపై క్లాప్‌ ఇచ్చారు.. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్‌ మాట్లాడారు,. ఈసినిమా స్విట్జర్లాండ్‌, అమెరికాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నామన్నారు.. సినిమా మొదటి ఫ్రేమ్‌ నుంచి ఎంటర్‌టైన్‌మంట్‌తోపాటు క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుందన్నారు.. జూన్‌ 3వ వారం నుంచి ఈసినిమా రెగ్యులర్‌ షూటిగ్‌ ప్రారంభిస్తామన్నారు.. త్వరలో నటీనటుల వివరాలు తెలియజేస్తామన్నారు.