మే1న ‘రాయ్’ ఫస్ట్‌లుక్‌

On 1 May, 'Rai' First Look

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో సి.ఆర్‌. మనోహర్‌ (ఎం.ఎల్‌.సి) నిర్మాతగా, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్  టైటిల్‌పాత్రలో నటిస్తున్న ‘రాయ్’ .సినిమా ఫస్ట్‌లుక్‌ మే 1న సాయంత్రం ముత్తప్ప రాయ్ పుట్టినరోజు సందర్భంగా యాభై వేల మందిప్రజల మధ్యలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బెంగళూరులోని బిదాడి వేదిక కానుంది. రూ.55 కోట్ల భారీ బడ్జెట్‌తో లండన్‌, దుబాయ్, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరిస్తున్నారు. సత్య కంపెనీ వంటి విజయవంతమైన గ్యాంగ్‌స్టర్స్‌ చిత్రాలను తెరకెక్కించిన రాంగోపాల్‌ వర్మ ఈసినిమాను అనౌన్స్‌ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఫ్యాన్సీ చెల్లించి ఈ సినిమా హక్కులను పొందారు. ఈసినిమా హిందీ వెర్షన్‌ హక్కులను వేవ్‌ ఫిలింస్‌ అధినే రాజు చద్దా, ఈరోజ్‌ ఇంటర్నేషనల్‌ సునీల్‌ లుల్గా సొంతం చేసుకున్నారు. అలాగే తమిళ హక్కులను సౌతిండియా ఫిలింఛాంబర్‌ అధ్యక్షుడు గంగరాజు సొంతం చేసుకున్నారు.

జీనియస్‌, రామ్‌లీలా వంటి చిత్రాలను నిర్మించిన అన్‌కాంప్రమైజ్‌ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ ప్రస్తుతం రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో వంగవీటి సినిమాను నిర్మిస్తున్నారు. ఈయన రాయ్ తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.

పలువురు అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఆధ్వరంయలో లేజర్‌ కిరణాలతో రాయ్ ఫస్టలుక్‌ను విడుదల చేస్తున్నారు. మే 1న విడుదల కానున్న ఈ ఫస్ట్‌లుక్‌ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.