మే చివరి వారంలో ఉంగరాల రాంబాబు!

UNGARALA RAMBABU2
UNGARALA RAMBABU

మే చివరి వారంలో ఉంగరాల రాంబాబు!

సునీల్‌ హీరోగా.. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉంగరాల రాంబాబు. ప్రస్తుతం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి.. యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్‌ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్నారు. సునీల్‌ సరసన అందాల భామ మియా జార్జ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. మే మొదటి వారంలో జిబ్రాన్‌ సంగీతమందించిన ఆడియోని విడుదల చేసి… మే చివరి వారంలో సినిమా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. మా దర్శకులు క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం షూటింగ్‌ పూర్తయింది. సునీల్‌ నుంచి ఆశించే వంద శాతం కామెడీ ఇందులో చూస్తారు. ఎంజా§్‌ు చేస్తారు. దర్శకుడు క్రాంతి మాధవ్‌ హిలేరియస్‌ కామెడీ సన్నివేశాలతో కథను అద్భుతంగా చెప్పారు. నవ్వించమే ద్యేయంగా… అవుటాఫ్‌ కామెడి కాకుండా కథలోనే కామెడీని పొందు పరిచి నవ్విస్తాం. ప్రకాష్‌ రాజ్‌ గారి పాత్ర సినిమాకు హైలైట్‌ గా నిలుస్తుంది. హీరోయిన్‌ మియా జార్జ్‌ మరో ప్లస్‌ పాయింట్‌. పాటలు చాలా బాగా వచ్చాయి. ఆడియో సూపర్‌ హిట్‌ కావడం గ్యారంటీ. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రకాష్‌రాజ్‌, పోసాని కష్ణమురళి, వెన్నెల కిషోర్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. మే మొదటి వారంలో జిబ్రాన్‌ సంగీతమదించిన ఆడియో రిలీజ్‌ చేయనున్నాం. మే చివరి వారంలో సమ్మర్‌ కానుకగా చల్లని వినోదాల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.