‘మెగా’ లవ్‌ శాశ్వ‌త‌ లాక్‌..

upasana, ram
upasana, ram

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ప్రేమికులంతా తమ తమపార్టనర్స్‌తో మర్చిపోలేని జ్ఞాపకాల కోసం పరుగులు పెడుతుంటే మెగా కోడలు ఉపాసన కూడ తనదైన శైలిలో ట్విట్టర్‌లో భర్తరామ్‌చరణ్‌తో ఉన్న లవ్లీ పిక్స్‌ని షేర్‌ చేసుకోవటం వైరల్‌గా మారింది. అందులో చరణ్‌తో ఉన్న ఉపాసన వివిధ ప్రేమికుల పేర్ద మీద లాక్‌ చేసిన తాళాల గుత్తిలో వాటితోపాటు తమది కూడ జోడిస్తున్నానను అని చెబుతూ విషెస్‌ చెప్పింది. మా లవ్‌ని శాశ్వతంగా లాక్‌ చేస్తున్నాను. అనిచెప్పిన ఉపాసన తనకు చరణ్‌ మీద ఎంత ప్రేమ ఉందో మరోసారి బయటపెట్టుకుంది. స్వతహాగా చరణ్‌-ఉపాసనలది ప్రేమ వివాహనం కాబట్టి ఇపుడు చేసినట్వీట్‌కి ఇంకాస్త బలం చేకూరించని అంటున్నారు. రంగస్థళం ఫినిషింగ్‌లో బిజీగా ఉన్న చెర్రికి ఇది స్పెషల్‌ గిఫ్ట్‌అనే వాఖ్యలు విన్పిస్తున్నాయి.