మెగాస్టార్స్.. మధ్యలో అల్లు బోయ్

Allu Boy With Mega Stars
Allu Boy With Mega Stars

`సైరా` రిలీజ్ కి ఇంకో 18 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో కొణిదెల కాంపౌండ్ ప్రచారంతో హీట్ పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. మరో ఐదు రోజుల్లో (18 సెప్టెంబర్) ప్రీరిలీజ్ ఈవెంట్ .. ట్రైలర్ రిలీజ్ తో అసలైన ప్రచారం మొదలు కానుంది. ఈ పదిహేను రోజులు ఊపిరి సలపనంత షెడ్యూల్ తో రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి బృందం ప్రమోషన్స్ ని డిజైన్ చేశారని తెలుస్తోంది. దాదాపు లక్షమంది అభిమానుల సమక్షంలో సైరా హైదరాబాద్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ ప్రీఈవెంట్ కి అతిధులుగా ఎస్.ఎస్.రాజమౌళి- పవన్ కల్యాణ్ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారానికి మేము సైతం అంటూ అల్లు హీరోలు ముందుకొస్తున్నారు
బన్ని సోదరుడు అల్లు శిరీష్ కూడా లైన్ లో కొచ్చాడు. ప్రస్తుతం శిరీష్ ఇద్దరు మెగాస్టార్లతో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 ప్రస్తుతం మెగాఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ఇది వైరల్ గా మారింది. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తెలుగు- హిందీ- తమిళం- మళయాళం- కన్నడ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. దేశంలోని అన్ని మెట్రోల్లోనూ వరుస ఈవెంట్లతో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం చరణ్ ప్రీరిలీజ్ పనుల హడావుడిలో ఉన్నారు