మూడు పెద్ద సినిమాలతో బిజీ

Rakul preet sing55
Rakul preet singh

స్టార్ హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఎప్పుడూ ముందే ఉంటుంది. ఏ తెలుగు స్టార్ హీరో సినిమాకైనా ఆమె పేరును పరిశీలించాల్సిందే.

హిందీలలో ఆమె చేసిన ‘అయ్యారే’ చిత్రం వచ్చేనెల రిలీజ్ కానుంది. అంతేగాక స్టార్ హీరో అజయ్ దేవగన్ సినిమాలో సైతం ఛాన్స్ దక్కించుకుంది.

అలాగే తమిళంలో స్టార్ హీరో సూర్య, సెల్వ రాఘవన్ కలిసి చేస్తున్న సినిమాలోని ఇద్దరు హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఇలా వేరే భాషల్లో మూడు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న ఆమె తెలుగులో ఇంకా సినిమాను ఓకే చేయకపోవడం వెనుక కారణం బిజీ షెడ్యూళ్లా లేకపోతే వచ్చే కథలు నచ్చడంలేదా అనేది ఆమె ద్వారానే తెలియాలి.