ముహూర్తం ఫిక్స్‌..

VENKATESH, TEJA
VENKATESH, TEJA

ముహూర్తం ఫిక్స్‌..

రానాకు ‘నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మంచి హిట్‌ ఇచ్చిన దర్శకుడు తేజ ఇపుడు వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నారు.. ‘ ఆలా నాదే వేట నాదే అనే టైటిల్‌ ఈసినిమాకు ఖరారుచేశారు.. అనుప్‌ రూబెన్స్‌ సంగీతం అందించబోతున్న ఈసినిమా డిసెంబర్‌ 4న ప్రారంభం కానుంది.. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో నిర్మితమవుతున్న ఈచిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.. ముగ్గురు కథానాయికలు నటించబోయే ఈసినిమాలో మరో హీరో ప్రధాన పాత్రలోనటించనున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా క్సోం నటీనటుల ఎంపిక జరుగుతోంది.. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్న ఈసినిమాతో వెంకటేష్‌ హిట్‌ కొట్టటం గ్యారెంటీ అని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.. ఈ ప్రాజెక్టులో నటించబోయే హీరోయిన్ల పేర్లు రకరకాలుగా విన్పిస్తున్నా అఫీషియల్‌గా ఇంకా ప్రకటించలేదు.