‘మా’ కార్యవర్గ ప్రమాణస్వీకారం!

MAA1
MAA

‘మా’ కార్యవర్గ ప్రమాణస్వీకారం!

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియషన్‌) నూతన కార్యవర్గం శివాజీ రాజా అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం ఉదయం హైదరాబాద్‌ ఫిలిం నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ లో మా అధ్యక్షలుగా శివాజీ రాజా.. మిగతా కార్యవర్గ సబ్యులను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఇదే వేదికపై మా తరుపున కళాతస్వీ కె.విశ్వనాథ్‌, సీనియర్‌ నటి శారదలను సూపర్‌ స్టార్‌ కష్ణ, విజయ నిర్మల దంపతులు సత్కరించారు. అనంతరం తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ.. గత మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించాయి. కానీ ఈ సారి మా టీమ్‌ అంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అప్పట్లో చిరంజీవిగారు, కష్ణ గారు వంటి పెద్దలు ఆధ్వర్యంలో మాకు బీజం పడింది. నాటి నుంచి నేటి వరకూ కళాకళారుల శ్రేయస్సు కోసం అందరూ కషి చేస్తున్నారు. ప్రబుత్వం తరుపున 1000 రూ..లు పెన్షన్‌ అందిస్తాం.

అలాగే పేద కళాకారులకు రేషన్‌ కార్డులు కూడా అందించాలనుకుంటున్నాం. దసరా నుంచి నంది అవార్డుల స్థానంలో కొత్త పేరుతో అవార్డులు ఇవ్వాలని ప్రబుత్వం రంగం సిద్దం చేస్తోంది అని అన్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.. మా లో సబ్యులంతా నన్ను విశ్వసించి నాకు బాధ్యత అప్పగించారు. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాను. ఏ నిర్ణయం తీసుకున్నా 26 మందితో సంప్రదించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తాం. పెన్షన్‌ 25శాతం పెచుతున్నాం. అలాగే మాకు కొత్త భవనం ఏర్పాటయ్యే విధంగా శ్రమిస్తాను. ఈసారి మా సిల్వర్‌ జూబ్లీ వేడుకలు సినీ పెద్దలు సమక్షంలో ఘనంగా చేస్తాం అని అన్నారు. మా చీఫ్‌ అడ్వైజర్‌, సూపర్‌ స్టార్‌ కష్ణ మాట్లాడుతూ.. ఈ సారి మా కోసం కొత్త టీమ్‌ వచ్చింది. మా ను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని.. కళా కారులందరికీ న్యాయం జరిగేలా పథకాలు ఉండాలి అని అన్నారు. ఇదే వేదికపై మా లోని కొంత మంది కళాకారులకు ద్విచక్ర వాహనాలను, చెక్‌ లను అందించారు. ప్రత్యేకంగా సీనియర్‌ పాత్రికేయలు పసుపులేటి రామారావు కు మా తరుపున స్కూటర్‌ అందించారు. అలాగే ఈ కార్యకమంలో మా మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.