మళ్లీ కుమారి 21ఎఫ్‌ కాంబినేషన్‌ రిపీట్‌!

KUMARI 21F TEAM
KUMARI 21F TEAM

మళ్లీ కుమారి 21ఎఫ్‌ కాంబినేషన్‌ రిపీట్‌!

చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్‌. జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ నిర్మాతగా…సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో హాట్‌టాఫిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థ నుంచి రానున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శఖుడు ఆగస్టు 4న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థ మరో తాజా చిత్రానికి శ్రీకారం చుట్టబోతుంది.

కుమారి 21 ఎఫ్‌ సెన్సేషనల్‌ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కాబోతుంది. ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించిన రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ ఈ తాజా చిత్రానికి సంగీతం అందించడం ఈ చిత్రంకు మొదటి ఆకర్సణ. కుమారి 21 ఎఫ్‌ విజయంతో తారాజువ్వలా దూసుకెళ్తున్న రాజ్‌తరున్‌ ఈ చిత్రాంలో కథానాయకుడు. కుమారి 21ఎఫ్‌ చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న పల్నాటి సూర్యప్రతాఫ్‌ ఈ నూతన చిత్రానికి దర్శకుడు. వైవిధ్యమైన కథలకుచిరునామాగా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ అందిస్తున్న కథతో సుకుమార్‌ రైటింగ్స్‌ అండ్‌ రేష్మాన్‌ ఆర్ట్స్‌ సంయుక్తగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి విజయప్రసాద్‌ బండ్రెడ్డి, సునీత రాజ్‌కుఆర్‌ బృందావనం నిర్మిస్తారు. సహ నిర్మాత శ్రీ తులసి బండ్రెడ్డి. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే తపనతోనే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థను స్థాపించాం. సుకుమార్‌ ఆలోచనలు, ఆయన విభిన్నత గురించి ప్రత్యేకంగా చెప్పన్నర్లేదు. ఆయన నుండి అందరూ ఎలాంటివైవిధ్యమైన చిత్రాలను కోరుకుంటారో ఈ తాజా చిత్ర కూడా అంతకుమించిన కొత్తదనంతో వ్ఞండబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు.