మల్టీ స్టారర్‌ ప్రాజెక్టులో

Namrata sirodkhar
Namrata sirodkhar

మల్టీ స్టారర్‌ ప్రాజెక్టులో

బాలీవుడ్‌ హీరోయిన్‌ అయిన నమ్రతా శిరోద్కర్‌.. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును 2005లో వివాహం చేసుకున్నా..సినిమా రంగానికి పూర్తిగా దూరమైంది..ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలు పర్ఫెక్‌గా నెరవేరుస్తోంది..
గతంలో మిస్‌ఇండియా కూడ అయిన నమ్రత.. ఇపుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అని చెప్పేయటం సెన్సేషన్‌ అవుతోంది.. తాజాగా ఓ ప్రేవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. త్వరలో ఓ మల్టీస్టారర్‌ మూవీలో నటించబోతున్నాంటూ అసలు విఫయం చెప్పేసింది.. 2005లో చివరగానటించిన హాలీవుడ్‌ మూవీ బ్రైడ్‌ అండ్‌ప్రిజుడీస్‌ రిలీజ్‌ అయ్యింది.. అదే ఏడాది మహేష్‌ను వివాహమాడిన ఈమె మళ్లీ 12 ఏళ్ల తర్వాత కొత్త సినిమా కబురుచెప్పింది..
అయితే ఇంతకీ నమ్రత నటించబోయే మల్టీస్టారర్‌ ప్రాజెక్టుఏదబ్బా అనే చర్చ విపరీతంగా సాగుతోంది.. అటుహిందీలో అయితే..మల్టీస్టారర్‌లు తెగ వచ్చేస్తుంటాయి.. ఇటు తెలుగులో కూడ ఈ ట్రెండ్‌ ఊపందుకుంది.. పైగా ఇపుడు పలు మల్టీస్టారర్‌ మూవీల గురించి చర్చలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో మల్టీస్టారర్‌లో నటిస్తున్నానని చెప్పి పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది ఈమె..