మంచు విష్ణుకు మరోక పాప పుట్టింది

Vishnu Manchu
Vishnu Manchu

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో మంచు విష్ణు, విరానికా దంపతులకు మరోసారి అమ్మాయి జన్మించింది. విష్ణుకు ఇప్పటికే ఇద్దరు కవల అమ్మాయిలు, అవ్రామ్ అనే అబ్బాయి ఉన్నారు. కాగా, తనకు మళ్లీ అమ్మాయి పుట్టిందంటూ విష్ణు ట్వీట్ చేశారు. ఖిఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్ఖి అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇవాళ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మీ వ్రతం శుభఘడియలు కావడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది. సినీ ప్రముఖులు, బంధుమిత్రులు మంచు విష్ణుకు ఈ ఆనందమయ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/