భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో!(ప్రణీత)

PRANEETHA1
PRANEETHA

భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో!(ప్రణీత)

కన్నడ బ్యూటీ ప్రణీత, తెలుగులో చిన్న సినిమాలతోపాటు పెద్ద సినిమాలు కూడా చేసేసింది. ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అంటే అత్తారింటికి దారేది. దురదృష్టవశాత్తూ మళ్ళీ తెలుగులో ఆ స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఇంతకీ, ఇప్పుడు ప్రణీత ఏం చేస్తోంది.? ఈ ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, సినిమాల్లో అవకాశాలు వస్తూనే వున్నాయి.. అవి కాకుండా, వ్యాపార కార్యకలాపాలు మొదలు పెట్టా.. అంటూ చెప్పుకొచ్చింది. బెంగళూరులో ఫుడ్‌ అండ్‌ బార్‌ బిజినెస్‌ ఛెయిన్‌ ప్రారంభించిన ప్రణీత, దాన్ని విస్తరించే పనిలో బిజీగా వుంది. తన కుటుంబంలో చాలామంది డాక్టర్లున్నారనీ, తనపైనా వైద్య వృత్తికి సంబంధించిన ఒత్తిడి వుండేదనీ, అయితే సినిమాలపై ఇష్టం కారణంగా గ్లామర్‌ ప్రపంచంలోకి వచ్చానని చెప్పుకొచ్చింది ప్రణీత. ఆ మధ్య, ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రణీత ప్రయత్నాలు కూడా చేసింది. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే, ప్రస్తుతానికైతే ఆ స్థాయిలో డబ్బుల్లేవ్‌.. ఇప్పుడు బిజినెస్‌ స్టార్ట్‌ చేశాను గనుక.. ఏమో, భవిష్యత్తులో నిర్మాతనవుతానేమో.. అంటూ నవ్వేసింది. హీరోయిన్లు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. అయితే, అలా నిర్మాతలుగా అవతారమెత్తినవారిలో చాలామంది ఫెయిల్యూర్స్‌ చవిచూశారు. కానీ, ఓ వైపు వైద్య వృత్తి, ఇంకోపక్క ఆసుపత్రుల బిజినెస్‌ తమ కుటుంబానికి అలవాటే గనుక, తాను ఏ బిజినెస్‌లో అయినా సక్సెస్‌ అవుతానని అంటోంది ప్రణీత.