బ్యాంకాక్‌లో వ్యాపారాలు

rakul

బ్యాంకాక్‌లో వ్యాపారాలు

టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రాజెక్టుల ప్రకారం మంచి స్పీడులో ఉంది.. హైదరాబాద్‌కు మకాం మార్చేసిన ఈబ్యూటీ ఇక్కడ వ్యాపారాలు కూడ మొదలుపెట్టేసింది.. ఎఫ్‌ 45 అంటూ ఓ జిమ్‌ను నడుపుతున్న విషయం తెలిసిందే.. నిజానికి ఎఫ్‌ 45 అనే బ్రాండ్‌కుచెందిన గచ్చిబౌలి ఫ్రాంచైజీని..రకుల్‌ హయాంలో నడుస్తోంది.. తాజాగా ఓ సినిమా షూట్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లిన రకుల్‌ అక్కడ కూడ ఎఫ్‌ 45 జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్‌ చేస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.. నచ్చిన పని చేయటానికి టైం ఎప్పడూ దొరుకుతుంది.. బ్యాంకాక్‌లోని ఎఫ్‌ 45లో వర్కవుట్స్‌ చేస్తున్నా.. అంటూ ట్వీట్‌ పెట్టింది రకుల్‌ప్రీత్‌సింగ్‌…బ్యాంకాక్‌లో ఎఫ్‌ 45ని రకుల్‌ప్రమోట చేయటం చూస్తుంటే ఆ ఫ్రాంచైజీ కూడ రకుల్‌ప్రీత్‌ దే అనుకుంటున్నారు అభిమానులు.. అదండీ సంగతి..