బిజీగా ఉండడం వల్లనే

SRIMUKHI-1
SRIMUKHI

జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో దాదాపు చివరి దశకు వచ్చేసింది. మొదట్లో బిగ్ షో తెలుగులో వస్తోంది అన్నప్పుడు ప్రేక్షకులందరు చాలా ఆతృతగా ఎదురుచూశారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్ అన్నప్పుడు అంచనాలు చాలా పెరిగిపోయాయి. ఆ తర్వాత పార్టిస్పెంట్స్ ఎవరొస్తారా అని అనుకోగా తీరా వచ్చిన వారిని చూసిన ప్రేక్షకులకు ఊహించని స్టార్స్ దర్శనమిచ్చారు. ఎలాగైతే ఏంటని ఇప్పటివరకు అదే స్టార్స్ తో బాగానే నెట్టుకొచ్చారు. అయితే ఈ షోకి ముందు చాలా పెద్ద స్టార్స్ నే అనుకున్నారట.

కానీ వారు అన్ని రోజులు హౌస్ లో ఉండడానికి ఇష్టపడలేదు. అలాగే మరికొంతమంది షూటింగ్స్ వల్ల బిజీగా ఉండి నో చెప్పారట. అయితే ప్రస్తుతం తెలుగు యాంకర్ గా పాపులర్ అవుతున్న శ్రీ ముఖీ కి కూడా మొదట బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదట. అందుకు గల కారణాన్ని రీసెంట్ గా సోషల్ మీడియా  లైవ్ చాట్ లో నెటిజన్లకు చెప్పింది. మొదటగా ఆమె బిగ్ బాస్ షో అంటే నాకు చాలా ఇష్టమని చెబుతూ..హిందీ బిగ్ బాస్ షో వచ్చినపుడు చూసిన షోలనే పదే పదే చూసేదన్నని చెప్పింది. ఇక బిగ్ బాస్ చేయకపోవడానికి కారణం నేను పటాస్ వంటి షోలతో బిజీగా ఉండడం వల్లనేనని చెప్పింది. అంతే కాకుండా తనకు బిగ్ బాస్ లో నటించాలని అంతగా ఇంట్రెస్ట్ కూడా ఏమి లేదనేవిధంగా సమాధానం ఇచ్చింది. దీంతో పాటు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చిన ముందురోజే ఓ కొత్త షోను ఒకే చేసినట్టు శ్రీ ముఖి చెప్పింది. ఆ కారణంగా బిగ్ బాస్ లోకి వెళ్లలేదని చెప్పింది.