‘బాహుబలి’కి పాక్‌ ఆహ్వానం

PRABHAS
PRABHAS

‘బాహుబలి’కి పాక్‌ ఆహ్వానం

ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ని ఒక్కసారిగా షేక్‌ చేసిన ‘బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగువారి ఖ్యాతిని ఒక్కసారిగా పెంచేసిన ఆసినిమా ఇతర దేశాల అభిమానులను కూడ ఎంతగానో ఆకట్టుకుంది.. ఐదేళ్ల కష్టానికి ఫలితం దక్కింది.. ఇంకా దక్కుతూనే ఉంది.. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి స్థాయి చాలా వరకు పెరిగింది.. విషయానికొస్తే.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ ఫెస్టివల్‌ జరిగినా బాహుబలి పేరు విన్పించేది.. ఈచిత్రంయూనిట్‌ దాదాపు ముఖ్యమైన దేశాలన్నింటినీ కవర్‌ చేసింది.. ఊహించని విధంగా పాకిస్థాన్‌ కూడ తెలుగు కళను మెచ్చింది.. బాహుబలి హిందీలో రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నుంచి బాహుబలి టీంకు ఆహ్వానం లభించింది.ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా తెలియజేశారు. కరాచీలో జరిగే ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి చాలా మంది సెలబ్రిటీలు రాబోతున్నారు.. కాగా ఎన్నో దేశాల ఆహ్వానాలు అందుకుని ఆయా ప్రాంతాల్లో పర్యటించిన రాజమౌళి పాకిస్థాన్‌ పిలవగానే చాలా ఆసక్తిగా ఎగ్జైటింగ్‌ ఫీలవుతున్నారు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాజమౌళి తారక్‌-ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్‌ను ప్లాన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.