బాపినీడు మృతిపట్ల కెసిఆర్‌ సంతాపం

kcr, telangana cm
kcr, telangana cm

హైదరాబాద్‌: ప్రముఖ సినీ దర్శకుడు,నిర్మాత విజయబాపినీడు మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్‌ సంతాపం తెలియజేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.