బంగారి బాలరాజు మూవీ ప్రారంభం

Boganti

బంగారి బాలరాజు మూవీ ప్రారంభం

నంది, చల్లా క్రియేషన్స్‌ బ్యానర్‌పై కెఎండి రఫీ నిర్మాతగా బంగారి బాలరాజు మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవికి లవ్‌ ఈజ్‌ బ్యాక్‌ ట్యాగ్‌ లైన్‌. రైల్వేట్రాక్‌ అనే టెలీ ఫిల్య్తో తొలి చిత్ర ఉత్తమ చిత్ర దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్న కోటేంద్ర దుద్యాల ఈ మూవీకి దర్శకత్వంతో పాటు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే బాధ్యలు నిర్వహిస్తున్నారు. నిర్మాతగా రఫీ నిర్మిస్తున్న ఈ తొలి చిత్రం షూటింగ్‌ రామానాయుడు స్టూడియోలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైది. నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ మూవీకి క్లాప్‌ను గాడ్‌ఫాదర్‌ సాగర్‌ ఇవ్వగా, యువ హీరో నాగ అన్వేష్‌ కెమెరా స్విచ్‌ఆన్‌ చేశారు. ఈ మూవీ స్క్రిప్ట్‌ను సిందూర పువ్ఞ్వ కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిర్మాత రఫీ, దర్శకుడు కోటేంద్ర స్వీకరించారు. అనంతరం ఆ చిత్ర దర్శఖుడు కోటేంద్ర దుద్యాల మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవ్ఞతున్నానని తెలిపారు. గత పధ్నాలుగు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్గా, ఆర్టిస్టుగా, అసిస్టెంట్‌ డైరెక్టర్గా పనిచేస్తున్న తాను డైరెక్టర్గా మారడం తనకు తో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం నిర్మాత మహ్మద్‌ రఫీ మాటాలడుతూ ఈ సినిమాలో కథని ఒక లైన్‌ తనకు వినిపించారని, అది నచ్చే ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టానని వెల్లడించారు. ఇది ఒక మంచి లవ్‌స్టోరీ అని తెలిపారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని తెలిపారు. నటీనటులు- రోహిణి, అజ§్‌ు ఘోష్‌, అప్పారావ్ఞ, లేఖన, ఆర్‌.పి, మహేంద్రనాథ్‌, సాంకేతిక వర్గం- సంగీతం: చిన్నికృష్ణ-చిట్టిబాబు ఎడ్డిపోగు, కెమెరా: బాబు జిఎల్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, ఎడిటింగ్‌: సాయిబాబు-హరి, కో-డైరెక్టర్‌: హేమంత్‌ కుమార్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కోటేంద్ర దుద్యాల, నిర్మాత: కె.ఎమ్‌డి.రఫీ, బ్యానర్‌-నంది, చల్లా క్రియేషన్స్‌.