ప్రేక్షకులను థ్రిల్‌ చేసే కథాంశం

mammootty
mammootty

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి హీరోగా నటించిన చిత్రం స్ట్రీట్‌ లైట్స్‌. ప్లే హౌస్‌ పిక్చర్స్‌ ప్రై.లి. నిర్మాణంలో శ్యామ్‌ దత్‌ వైమద్దీన్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించారు. విభిన్నమైన కథల్ని ఎంచుకునే మమ్ముట్టి ఈసారి కూడ ఆడియెన్స్‌ని థ్రిల్‌కు గురిచేసే కథాంశంతో స్ట్రీట్‌ లైట్స్‌ చిత్రంతో రానున్నారు. ఈచిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేశారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథ ఉందన్నారు. తెలుగు, తమిల్‌, మలయాళం భాషలతోపాటు తెలుగులో కూడ అదేపేరుతో విడుదల చేయనున్నామన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, మమ్ముట్టికి తెలుగు రాష్ట్రాల వీరాభిమానులున్నారు. ఆయనకున్న క్రేజ్‌ దృష్ట్యా స్ట్రీట్‌లైట్స్‌ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామన్నారు. స్ట్రీట్‌లైట్స్‌ తెలుగు టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. దర్శకుడు శ్యామ్‌ దత్‌ చెప్పిన కథ, కథనం అడియెన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తుందన్నారు. క్రైం థ్రిల్లర్‌గా సాగే ఈ కథ అందరినీ మెప్పిస్తుందన్నారు. మమ్ముట్టి గారి కెరీర్‌లో మరోమైలురాయిగా నిలిచే చిత్రంలా ఉంటుందనే నమ్మకం ఉందన్నారు.