ప్రేక్షకులందరూ కామ్రేడ్లే

DEAR COMRADE unit
DEAR COMRADE unit

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటిస్తున్న చిత్రం డియర్‌ కామ్రేడ్‌.. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌, బిగ్‌బెన్‌ సినిమాస్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి , యష్‌ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో విజయ్‌ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేశౄరు.. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. నాలుగు భాషల్లో ట్రైలర్‌ విడుదలైందన్నారు. అలాగే ఈనెల 26న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈసినిమా విడుదల కానుందని తెలిపారు. కష్టసుఖాల్లో తోడుండేవారిని కామ్రేడ్స్‌ అంటామని, నేను ఈస్థాయిలో ఉండటానికి కారణం ఆడియెన్స్‌ అభిమానం, ప్రేమ, సపోర్ట్‌ అన్నారు. వాళ్లంతా కామ్రేడ్లే అన్నారు. అందుకే వారి కోసం మ్యూజిక్‌ సెలబ్రేషన్‌ నిర్వహించాలనకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రష్మికా మందన్నా. చిత్ర దర్శకుడు భరత్‌ కమ్మ, నిర్మాత యష్‌ రంగినేని, నిర్మాత నవీన్‌ యెర్నేని, మరో నిర్మాత రవిశంకర్‌, చెర్రీ తదితరులు మాట్లాడారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos