ప్రభాస్‌ డబుల్‌ ధమాకా!

PRABHAS1
PRABHAS

ప్రభాస్‌ డబుల్‌ ధమాకా!

గత ఐదేళ్లపాటు బాహుబలి సినిమాకు పరిమితమయిన ప్రభాస్‌ ఇప్పుడు బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేసి అభిమానులను అలరించనున్నారు. ప్రస్తుతానికి ప్రభాస్‌ చేతిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. అందులో మొదటిది సాహో సినిమా అనే సంగతి అందరికీ తెలిసిందే అయినా రెండో సినిమా గురించే చాలా మందికి క్లారిటీ లేదు. అయితే, లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ ప్రకారం రెండో సినిమా రాధాకష్ణ డైరెక్షన్‌లో వుండనుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పైనే నిర్మితం కానుంది. సుజీత్‌ తెరకెక్కించే చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో రూపొందనుండగా రాధాకష్ణ సినిమా ఓ లవ్‌ స్టోరీ అని సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్లోనే తెరకెక్కుతుందని.. చాలా పోర్షన్స్‌ ఫారిన్లో షూట్‌ చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.