ప్రభాకర్‌ జైనీకి టి.సినీ స్వర్ణకమలం

PRABHAKAR-22
PRABHAKAR-

దర్శకుడు డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీకి టి.సినీ స్వర్ణకమలం ప్రదానం

2014 ఏడాదికి నంది అవార్డుగ్రహీత, ప్రముఖ నవలా రచయిత,. ప్రభాకర్‌ జైనీకి అంపశయ్య వంటి సంచలనాతమ్మక సినిమాను నిర్మించి దర్శకత్వం వహించినందుకు తెలంగాణ సినీ స్వర్ణకమలం అవార్డును అందజేశారు.. సారిధీ స్టూడియోస్‌లో జరిగినప కార్యక్రమంలో భాజపా సినిమా సెల్‌ ఆధ్వర్యంలో, ప్రముఖ నటుడు సివిఎల్‌ నరసింహారావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాజపా శాసనసభా పక్షం నేత ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై గాయని మధుప్రియ, టివి, సినీనటుడు అశోక్‌ కుమార్‌, సినీ క్రిటిక్‌ హెచ్‌.రమేష్‌బాబు, కాంతారావు కుమారుడు టిఎల్‌ రాజా, నటి అయేషా జలీల్‌, డెక్కన్‌ సినిమా ఆర్కే మామా తదితరులకు అవార్డులను బహూకరించారు.