పెళ్లితో ఒక్కటి కాబోతున్న ఆర్య,సాయేషా

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ఆర్య, నటి సాయేషా సైగల్ పెళ్లి విషయంలో గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ప్రేమికుల రోజు సందర్భంగా తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమేనని ఆర్య ట్విటర్ వేదికగా ప్రకటించారు. సాయేషాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఖమా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండిగ అని పేర్కొంటూ అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ తెలిపారు.