న్యూ ఇయర్‌ కానుకగా ఫస్ట్‌లుక్‌

new year gift
new year gift

డాక్టర్‌ మోహన్‌బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి. ఈచిత్రంలో మంచి విష్ణు ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నసంగతి తెలిసిందే.ఆయన సరసన తొలిసారిగా శ్రియ నటిస్తుండటం విశేషం. కొత్త సంవత్సరం కానుకగా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. మదన్‌ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం సమకూర్చారు. అనసూయ భరధ్వాజ్‌, నిఖిల విమల్‌ , బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రల్లో కన్పించనూన్నరు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు ఈచిత్రంరానుంది. గాయత్రి చిత్రాన్ని డాక్టర్‌ ఎం.మోహన్‌బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్‌ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌్‌పై నిర్మిస్తుండగా, ఆరియానా , విరియానా , విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.