నేను నా మాజీ భర్తను ఉద్దేశిస్తూ పుస్తకం రాయలేదు

Renu Desai - Anantha Sri Ram - Pawan Kalyan
Renu Desai – Anantha Sri Ram – Pawan Kalyan

హైదరాబాద్‌: నటి రేణూ దేశాయ్‌ ‘ఏ లవ్‌ ఆన్‌ కండీషనల్‌ ‘ అనే పుస్తకాన్ని రాశారు. ఇటివల ఈపుస్తకం విడుదలైంది. మంచి స్పందన కూడా వస్తుంది. అయితే పుస్తకం మొత్తం పవన్‌ను ఉద్దేశిస్తూ రాశరంటూ కామెంట్లు వస్తున్నాయట ఈవిషయం తెలుసుకున్న రేణూ స్పందించారు. నేను పవన్‌నూ ఉద్దేశిస్తూ ఈపుస్తకాన్ని రాయలేదు. ఇందలో ఎలాంటి వివాదాస్పద అంశాలను ప్రస్తావించలేదు పవన్‌ను మనసులో పెట్లుకునే నేను రొమాన్స్‌, సంతోషం, బాధల గురించి వివరిస్తూ పద్యాలు రాశానని అంటున్నారు. అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు నా భర్త నిజమే కాని ఆయన్ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నా నాకు ఇవే ఫీలింగ్స్‌ ఉంటాయి. అంతేకాని ఆయని ఉద్దేశించి రాసింది కాదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈఫీలీంగ్స్‌ ఉండటం సహజమే అని క్లారిటి ఇచ్చారు. రేణు ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్‌ అనువదించారు. రేణుకు పుస్తకాలు, నవలల పట్ల ఎంతో ఆసక్తి ఉంది