నెగెటివ్‌ కామెంట్స్‌ను ఎదుర్కొన్న ర‌కుల్‌

Rakul Preet Singh
Rakul Preet Singh

మొన్నటివరకు రకుల్‌ టాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో హల్‌చల్‌ చేసిందో అందరికీ తెలిసిందే. కోలీవుడ్‌లో కూడ ఖాకి సినిమాతో మంచి హిట్‌ కొట్టి స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశం దక్కించుకునేంత వరకు వచ్చింది. కానీ చివరి నిముషంలో అంతా తారుమారైంది. ఆమె ఆఫర్లు ను ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సాయిపల్లవి. కీర్తిసురేష్‌ కొట్టేశారు. అయితే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ ఖాకి సినిమా లో కార్తీతో జోడికట్టి శభాష్‌ అన్పించుకుంది. దీంతో సూర్య సరసన అలాగే మురుగదాస్‌ , విజ§్‌ు ప్రాజెక్టుల్లో దాదాపు ఫైనల్‌ అయ్యింది అనే టైంలో సూర్య సినిమాను సాయి కొట్టేయగా, కీర్తిసురేష్‌ విజ§్‌ుని రెండోసారి ఆకర్షించింది.
ఇంతకుముందు మురుగదాస్‌తో రకుల్‌ స్పైడర్‌ చేసి డిజాస్టర్‌ని అందుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పాత్ర చేసిందుకు నెగెటివ్‌ కామెంట్స్‌ను కూడ అందుకుంది. దీంతో సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుంది అనుకున్నారో ఏమో విజ§్‌ు నిర్ణయానికి మురుగదాస్‌ ఓకే చెప్పేసి కీర్తిసురేష్‌తో వర్క్‌ చేయటానికి సిద్ధమయ్యారు.