నిజ ఘటన ఆధారంగానే సినిమా చేశా- నరసింహ నంది

Narasimha nandi1

నిజ ఘటన ఆధారంగానే సినిమా చేశా- నరసింహ నంది

1940లో ఓ గ్రామం, హైస్కూల్‌, కమలతో నా ప్రయాణం, లజ్జ వంటి విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు చేస్తూ మంచి అభిరుచి ఉన్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు నరసింహ నంది. తాజాగా బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్‌ న్యూస్‌ పేరుతో మరో విభిన్నమైన సినిమాని రూపొందించారు. లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది మిత్రులు నిర్మించిన ఈ సినిమా గస్టు 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు నరసింహ నందితో జరిపిన ఇంటర్వ్యూ….

కథేంటి?
ఒక విలేజ్‌లో జరిగే కథ. గేదె ఒక ఫ్యామిలీని పోషిస్తుంటుంది. ఆ గేదె చనిపోతే ఆ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. ఇరానియన్‌ మూవీ ది కౌ ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్‌. దరుషి మెహర్జాన్‌ ఆ సినిమాకి దర్శకుడు. ఒక జంతువ్ఞకి, మనిషికి ఉన్నరిలేషన్‌ ఎలాంటిది అనేది ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది. వాళ్ళిద్దరు మధ్య ఎలాంటి ఎఫెక్షన్‌ ఉంటుందనే ఆ సినిమాలో చూపించారు. ఆ తర్వాత బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌ సినిమా చేయడానికి మెయిన రీజన నేను కళ్ళారా చూసిన ఓ యాక్సిడెంట్‌. ఆ ఊరికి వెళ్తున్నపుడు నలుగురు కుర్రాళ్ళు కారుని ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తూ గేదెను కొట్టేసి వెళ్ళిపోయారు. కనీసం కారు కూడా ఆపకుండా వెళ్ళిపోయారు. ఆ గేదె చనిపోయింది. ఆ గేదె తాలూకు మనిషి వచ్చి బాధపడుతూ వ్ఞంటే వెంటనే వెళ్ళి పోలీస్‌ కేస్‌ పెట్టండి అని చెప్పి వచ్చేశాను. ఒక జంతువ్ఞ తమ కారు కిందేపడి చనిపోతే ఎలాంటి బాధ, బాధ్యత లేకుండా వెళ్ళిపోయారు. దానికి ఏదో ఒక నష్టపరిహారం ఇస్తే బాగుండేది అనిపించింది.

కొడుకులా తమ కుటుంబాన్ని పోషిస్తున్న గేదె చనిపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి?
ఈ ఆలోయన వచ్చిన తర్వాత దీనిమీద ఒక సినిమా చేద్దాం అనిపించింది. దీనికి సంబంధించిన కథ రెడీ చేసుకొని కొన్ని కమర్షియల్‌ హంగులు కూడా అద్ది ఆ రైతు తనకుజరిగిన నష్టానికి ఎలాంటి పోరాటం చేశాడు? ఎలా నెగ్గాడు? కోర్డు ఎలాంటి జడ్జిమెంట్‌ ఇచ్చింది అనేది కథ. ఈ కథని కొత్తవాళ్లతోనే చేయడానికి రీజన్‌? కొత్తవాళ్ళతో చేస్తేనే ఈ కథకు న్యాయం జరుగుతుందనిపించింది. పాతవారైతే ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను క్రియేట్‌ చేసుకున్న క్యారెక్టర్స్‌ అన్నీ చాలా నేచురల్‌గా ఉంటాయి. మీ గత చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు.

ఈ సినిమాకి కమర్షియల్‌గా ఎలాంటి ఫలితం వస్తుందనుకుంటున్నారు?
ఈ కథని కొంచెం కమర్షియలైజ్‌ చేశాను. ఇందులో లాయర్‌ క్యారెక్టర్‌ ఉంటుంది. అతనికి ఓ లవ్‌స్టోరీ ఉంది. తన గేదె చనిపోయిందని, తనకున్యాయం చేయాలని గేదె యజమాని ఫైట్‌ చేస్తుటాడు. దీన్ని కమర్షియల్‌ యాంగిల్‌లోనే తియ్యడం జరిగింది. ఒక్కపక్క మీడియా, ఒకపక్క రిసోర్టర్‌, మరో పక్క టివి.ఛానల్‌ ఇలా మూడు యాంగిల్స్‌లో కమర్షియల్‌గానే చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను చేసిన సినిమాలు స్లో నేరేషన్‌లో ఉంటాయి.

ఇందులో పాటలెలా ఉంటాయి?
రెండు పాటలున్నాయి. ఒకటి రాజమండ్రిలో తీశాం. మరొకటి సిట్యుయేషనల్‌ సాంగ్‌. మీడియా మీద రాసిన పాట అది. చల్లా భాగ్యలక్ష్మీగారు ఈ పాటను చాలా అద్భుతంగా రాశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌ అనే టైటిల్‌ పెట్టడానికి కారణం?
ఈ సినిమా అంతా బుడ్డారెడ్డిపల్లి అనే గ్రామంలోనే చేశాం. ఆ గ్రామం నుంచి వెళ్ళినవారంతా చాలా గొప్పవాళ్ళయ్యారని చెబుతారు. ఆ ఊరికి 200సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ ఊళ్ళో ఉన్న బావినీరు తాగడం వల్ల అక్కడ పుట్టి పెరిగిన వారంతా మేధావులైపోయారు అని చెపుకుంటారు. అంతేకాకుండా బుడ్డారెడ్డిపల్లి అనే పేరు కూడా డిఫరెంట్‌గా ఉండాలని ఆ టైటిల్‌ పెట్టడం జరిగింది.

మీ సినిమాలన్నీ లో బడ్జెట్‌లోనే ఉంటాయి కదా. ఈ సినిమాని కూడా అలాగే తీశారా?
నేను ఇప్పటివరకు చేసిన సినిమాలకంటే ఈ సినిమాకి బడ్జెట్‌ కాస్త ఎక్కువే అయింది. ఎందుకంటే ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. ఎక్కువ క్రౌడ్‌ ఉంటుంది. మొత్తం 35రోజులు షూటింగ్‌ చేశాం. అలాగే సినిమాలో చాలా సీన్స్‌ సి.జి.చేయాల్సి వచ్చింది. అందుకే బడ్జెట్‌కూడా పెరిగింది.

మీ తదుపరి చిత్రాలు?
తెలుగు భాష గురించి ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పటికి 75 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఉత్పలమాల ఉత్తరం రాసింది ఆ సినిమా టైటిల్‌. చాలా మంచి సబ్జెక్ట్‌. కొన్ని తెలుగు పదాలు మనుషుల రూపంలో వస్తే, ఇప్పుడు నం మాట్లాడుకుంటున్న భాషను చూస్తే వాళ్లు ఎలా పీల్‌ అవ్ఞతారు అనేది కథ.