నిజాయితీ వల్లే విరాట్‌కు విలువిస్తా..

VIRUSHKA
VIRUSHKA

ముంబై: నిజాయితీ విషయంలో తన భర్త విరాట్‌ను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నానని అంటున్నారు బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ. ప్రస్తుతం వీరిద్దరూ న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నారు. అనుష్క ఒకప్పుడు ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిని ఇంటర్వ్యూలో విరాట్‌ గురించి చెప్తూ తనకు విరాట్‌లోని నిజాయితీ వలనే తనకు ఎంతో విలువనిస్తానని అనుష్క అన్నారు. తమ జీవితాల్లో ఎలాంటి దాపరికాలు లేవని, ఆడంబరాలు లేవని అన్నారు. అన్ని విషయాల్లో ఇరువురం పరస్పరం మద్దతు ఇచ్చుకుంటాం, వృత్తి పరంగా తనని తాను మెరుగుపరచుకోవాలని విరాట్‌ ప్రయత్నిస్తుంటాడు. అందుకే ఇద్దరి వైవాహిక జీవితం సాఫీగా ఆనందంగా ఉంది అని వెల్లడించారు అనుష్క.