నాగార్జున చాలా ఫ్రీడం ఇచ్చారు..

Director Ohmkar
Director Ohmkar

నాగార్జున చాలా ఫ్రీడం ఇచ్చారు..

జీనియస్‌ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ‘రాజుగారి గది తో మంచి విజయాన్ని అందుకున్న ఓంకార్‌.. ప్రస్తుతం నాగార్జున ప్రధానపాత్రలో ‘రాజుగారి గది2 అనే సినిమా చేశారు.. ఈనెల 13న ఈచిత్రం రిలీజ్‌ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజుగారి గది2 ప్రాజెక్టు ఎలా వర్కవుట్‌ అయ్యింది?
రాజుగారి గది సక్సెస్‌ తర్వాత రాజుగారి గది2 ..ఒక ఫ్యామిలీ సబ్జెక్టు రెండింటినీ తయారుచేసుకున్నాను.. అందులో రాజుగారి గది2ని వెంకటేష్‌గారికి చెప్పటం కుదిరింది.. కానీ ఆయనకు గురు సినిమా ఉండటం వలన కుదరలేదు.. ఆ తర్వాత పివిపిగారు పరిచయం అయ్యారు. ఆయనే రాజుగారి గదికి ప్రాంఛైజీ చేస్తు బాగుంటుందని అన్నారు.. దాంతో వెంకీగారికి చెప్పి కథ కాకుండా మలయాళంలో ప్రేతం నుంచిసోల్‌ పాయింట్‌ ను తీసుకుని కొత్త కథ రానుకున్నాను. అదే ఈ రాజుగారి గది2.
ఇందులో నాగార్జున , సమంతను తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది?
ఫైనల్‌గా కథ మొత్తం రెడీ చేసుకున్నాక. దాన్ని విన్న మ్యాట్నీసంస్థ నిరంజన్‌రెడ్డి గారు దీనికి నాగార్జునగారైతే బాగుంటుందని సలహా ఇచ్చారు.. దీంతో కథను ఆయనకు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు.. ఇక ఆత్మపాత్ర ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా, ఫ్యామిలీ ఎమోషన్‌ ఉంటుంది కాబట్టి సమంత అయితే బాగుంటుందని మళ్లీ నిరంజన్‌రెడ్డిగారు చెప్పారు. సమంతగారు కూడ కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు.

సమంతను తీసుకుంటున్నట్టు నాగార్జునకు ముందే తెలుసా?
సమంతను కలుస్తున్నట్టు నాగార్జునగారికి చెప్పలేదు.కానీప్రాజెక్టులో నాగార్జునగాయిన్నారని సమంతకు తెలుసు.. ఆయన ఒప్పుకున్న 20 రోజులకు సమంత ప్రాజెక్టుకి వచ్చారు.

మలయాళంలో ‘ప్రేతంకు దీనికి ఎలాంటి మార్పులు చేశారు?
ఎలాంటి మార్పులు అనేది ముందగా చెప్పకూడదు. కానీ ఆ సినిమా చూసిన వాళ్లకు తేడా స్పష్టంగా తెలుస్తుంది. కేవలం సెంటర్‌పాయింట్‌ మాత్రమే ఒకలా ఉంటుంది.. మిగతా మొత్తం డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది.

నాగార్జునతో చేయటం ఎలా అన్పించింది?
నాగార్జునగారికి ముందుగా కథ నచ్చితేచే సినిమా చేస్తారు.. అంతేగానీ నాకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కావాలని అడగరు.. ఈ హారర్‌ చిత్రంలో ఫైట్స్‌, సాంగ్స్‌ లాంటివి కూడ ఉండవు.. కథ వినే ఆయన ఒప్పుకున్నారు.. ఒక్కసారి కథ ఓకే అయ్యాక ఎక్కడా ఇన్వాల్వ్‌ అవ్వలేదు.. షూటింగ్‌ల్లో కూడ నువ్వే నా బాస్‌ , నువ్వేం చెప్తే అదే చేస్తాను..అన్నారు.. చివరి వరకు అదే మాట మీద ఉండి నేను ఎలా కావాలంటే అలా చేశారు.

విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం ముంబై ఎందుకు వెళ్లారు?
ముంబైకి వెల్లటమే బాగా ప్లస్‌ అయ్యింది.. అంటే ఇక్కడ మంచి కంపెనీస్‌ లేవని కాదు.. ఒకవేళ ఇక్కడి వాళ్లకు ప్రాజెక్టు ఇచ్చినా వాళ్లు వేరేదగ్గరికి పంపిస్తారు.. అదేదో నేరుగా అసలు వాళ్ల దగ్గరికి వెళితే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే అక్కడను వెళ్లటం జరిగింది.. అంతేకా సూర్యగారి 24 మూవీకి వాళ్లు చేసిన వాటర ఎఫెక్ట్‌ నాకు బాగా నచ్చాయి.. ఇందులో కూడ అలాంటి ఎఫెక్ట్సే ఉంటాయి.. అందుకే వాళ్లను చూజ్‌ చేసుకున్నాను. ఇక్కడ లోకల్‌ వాల్లు కూడ కొన్ని సీక్వెన్స్‌ చేశారు.

నాగార్జున పాత్ర ఎంతవరకు ఉంటుంది?
ఈసినిమాలో ఆయనో మెంటలిస్ట్‌.. మెంటలిజం అనేది సైన్స్‌, సైన్స్‌ ఏం సెంటర్స్‌ వరకు అయితే ఓకే, అందుకే బి , సి సెంటర్ల కోసం ఆయన పాత్రను ఇంకాస్త ఎలివేట్‌ చేశాం.. సినిమాలో ఆయనో మోడరన్‌ సెయింట్‌.

మీకు నాగార్జునకు అభిప్రాయ బేధాలు వచ్చాయని విన్నాం?
అలాంటివేం లేవు. ఒక సినిమా అంటే అంత ఈజీ కాదు.. జౌట్‌పుట్‌ రాకపోతే అభిప్రాయ బేధాలు ఉన్నట్టు .. కానీ ఇక్కడ మంచి సినిమా వచ్చింది.

ఈసినిమాలో ఏదన్నామెసేజ్‌ ఉందా?
తప్పకుండా ఉంటుంది.. మెసేజ్‌ను ప్రేక్షకుల మీద రుద్దకుండా వాళ్లకు తెలియకుండానేచెప్పిస్తాం.. ఆడవాళ్ల గురించి గుప్పగా చెప్పాం.. సమంత చెప్పే మాటలు థియేటర్లలోని ఆడవాళ్లందరికీ కనెక్ట్‌ అవుతాయి.