నాకు అదే నచ్చింది

RASHMIKA MADANNA-1
RASHMIKA MADANNA

నాకు ఇందులో అదే నచ్చింది

యంగ్ హీరో నాగ శౌర్య నటించితిన్ తాజా చిత్రం ‘ఛలో’. ఈ చిత్రంతో కన్నడ నటి రష్మిక మందన్న తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయంకానుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల్ ముందుకురానుంది. ఈ సందర్బంగా చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) మీ బ్యాక్ గ్రౌండ్ చెప్పండి ?
జ) నేను కూర్ లో 10వ తరగతి వరకు, బెంగూరులో డిగ్రీ చేశాను. అప్పుడే ‘కిరిక్ పార్టీ’ ఆఫర్ వచ్చింది. ఫ్రెష్ ఫేస్ అని ఆఫర్ వచ్చింది. అది సక్సెస్ కావడంతో హీరోయిన్ గా నిలదొక్కుకున్నాను.

ప్ర) ‘ఛలో’ సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం ?
జ) ఏ సినిమాకైనా కథ ముఖ్యం. నాకు ఇందులో అదే నచ్చింది. ఈ సినిమాతో లాంచ్ అయితే బాగుంటుందని చేశాను. టీమ్ మొత్తం కూడా నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం పిక్నిక్ లా జరిగింది.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి ?
జ) రెగ్యులర్ పాత్రే. ఒక సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన కాలేజ్ అమ్మాయి క్యారెక్టర్. అది అందరికీ కనెక్టవుతుంది. అందుకే ఈ సినిమాని చేయడానికి ఒప్పుకున్నాను.

ప్ర)ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటి ?

జ)ఈ సినిమా కథ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ వచ్చి సబ్జెక్టు చెప్పినప్పుడు థ్రిల్ అయ్యి ఓకే చేసాను. ఈ సినిమాలో నా పాత్ర బాగుంటుంది.

ప్ర)తెలుగులో మొదటి సినిమా చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ?
జ)అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కథ, కథనాలు ఉన్న సినిమాతో తెలుగులో లాంచ్ అవ్వడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఐరా క్రియేషన్స్ వంటి సంస్థలో పనిచెయ్యడం మరిచిపోలేనిది.

ప్ర) ఈ సినిమాకు చలో టైటిల్ పెట్టడానికి కారణం ?

జ) సినిమాకు ఛలో టైటిల్ కరెక్ట్ అనేది నా అభిప్రాయం. నాకు నాగ శౌర్య సినిమాకు మద్య వచ్చే సన్నివేశాలు చుస్తే మీకు ఈ సినిమా టైటిల్ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ సినిమాకు ఛలో టైటిల్ కరెక్ట్ జస్టిఫికేషన్ అనిపించింది.

ప్ర) సినిమాల్లో మీ రోల్ మాడల్ ఎవరు ?
జ) సినిమాను ప్రేమించి చేస్తాను. అందరిని ఆధరిస్తాను, అందరి సినిమాలు చూస్తాను. కాని ఎక్కువగా అనుష్క శెట్టి ని ఫాలో అవుతాను. ఆమె నాకు రోల్ మాడల్.

ప్ర)మీ తదుపరి సినిమాలు ?

జ) ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా తరువాత కన్నడలో కొన్నిసినిమలు చేస్తున్నాను.