నరసింహనాయుడు సీక్వెల్‌…

bala krishna
bala krishna

నరసింహనాయుడు సీక్వెల్‌…

పూరిజగన్నాధ్‌ దర్శకత్వంలో నటసింహం బాలయ్య నటించిన పైసావసూల్‌ చిత్రం తర్వాత బాలయ్య -రవికుమార్‌ల కాంబోలో జైసింహా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.. తాజాగా బాలయ్య మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.. అదే ప్రముఖ కథా రచియత చిన్నికృష్ణ చెప్పిన కథ బాలయ్యకు నచ్చటంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని టాక్‌. నరసింహనాయుడు చిత్రం ఆయన కెరీర్‌లో చెప్పకోదగ్గ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఈచిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది.. 2001లో బిగోపాల్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.తాజాగా ఈసినిమాకు సీక్వెల్‌గా ఓ కథను చిన్నికృష్ణ రాసుకున్నారట..ఈ కథను బాలయ్యకు విన్పించటంతో ఆయనకూ ఓకే చెప్పారని టాక్‌.. త్వరలోనే ఈ సీక్వెల్‌పై అధికారికంగా ప్రకటన రానుంది..