ది లాస్ట్‌ హర్రర్‌

The Last Harror-1
The Last Harror

ది లాస్ట్‌ హర్రర్‌

మేఘాంశ్‌ మూవీస్‌ పతాకంపై బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన దిలాస్ట్‌ హర్రర్‌ అనేచిత్రాన్ని అదే పేరుతో తెలుగులో యువనిర్మాత బిఎస్‌ ప్రసాద్‌ అనువదించారు.. ది లాస్ట్‌ హర్రర్‌ సినిమాకు దెయ్యాల ఆట మొదలైంది అనేది ఉపశీర్షిక.. ఈసందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ఓ ఫామ్‌హౌస్‌కు సంబంధించి రిసార్ట్స్‌ ప్లానింగ్‌ కోసం ఇద్దరు యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.. ఆ భవంతికి ఇన్‌చార్జిగా ఉన్న కేర్‌టేకర్‌ భార్య ఇద్దరు పారిశ్రామికవేత్తుల చేతుల్లో బలైపోతుంది.. ఆమె ఆత్మ మరికొన్ని ఆత్మలతో కలిసి ప్రేతాత్మలుగా మారతాయి.. వాటిని దిగ్బంధిచటానికొచ్చిన ఓ మంత్రికుడు కూడ హత్యగాబడి ఆ ప్రేతాత్మల్లో కలిసిపోతాడు.. అప్పట్నుంచి ఆ బంగళాలో అడుగుపెట్టిన మనుషులమీద దెయ్యాల ఆట మొదలవుతుంది.. రిసార్ట్స్‌ ప్లానింగ్‌ కోసం వచ్చిన యువజంట ఈ మిస్టరీని ఏవిధంగా చేధించిందనేదే ఈచిత్ర కథాంశం.. ఆద్యంతం భయానకమైన సస్పెన్స్‌తో సాగే ఈ రొమాంటిక్‌ హర్రర్‌ చిత్రం ఊహించని మలుపులతో కొనసాగుతుంది.. అనువాద కార్యక్రమాలు పూర్తయి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను ఈనెలలోనే విడుదల చేయటానికి సన్నాహాలుచేస్తున్నామని తెలిపారు. శ్యామ్‌, షరీఫ్‌, అమృత , మీతా యువజంటగా నటిస్తున్నారు.