‘దర్శకుడు ప్రీరిలీజ్‌ వేడుక

DARSAKUDU PRE RELEASE FUNCTION
ARSAKUDU PRE RELEASE FUNCTION

‘దర్శకుడు. ప్రీరిలీజ్‌ వేడుక

సెన్సేషనల్‌ డైరెక్టర సుకుమార్‌ నిర్మాతగా సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘దర్శకుడు. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై వచ్చిన కుమారి 21 ఎఫ్‌ చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే.. ఆ చిత్రం తర్వాత వస్తున్న ‘దర్శకుడు చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి బిఎసన్‌సిఎస్‌పి విజ§్‌ుకుమార్‌, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి సంయుక్తంగా నర్మిస్తున్నారు.. అశోక్‌, ఈషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా.. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తిచేసుకన్న ఈచిత్రం ఆగస్టు లో విడుదల కానుంది.. ప్రచారంలో భాగంగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను శనివారం రాత్రి ఇక్కడి తాజ్‌ దక్కన్‌లో ఘనంగా నిర్వహించారు..ఈచిత్రం యూనిట్‌తోపటు స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, దర్శకుడిగా ఉంటూ నిర్మాతగా మారి ఓ మంచి చిత్రాన్ని సుకుమార్‌ నిర్మించటం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు..గతంలో కుమారి 21 ఎఫ్‌ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందిరికీ తెలుసునని అన్నారు. ఆచిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. ఉన్న ఆత్మీయుల్లో సుకుమార్‌ ఒకరని తెలిపారు.. ఆర్య, ఆర్య2 తర్వాత ఇపుడు మళ్లీ మా కాంబినేషన్‌లో ఆర్య3 కోసం మీరు ఎంతగానో ఎదురుచూస్తున్నారు కదా..అంటూ ప్రేక్షకుల నుద్ధేశించి ఆయన మాట్లాడినపుడు ప్రేక్షకుల హర్హద్వానాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది.. ఈసందర్బంగా యూనిట్‌తోపాటు సాంకేతిక నిపుణులకు అల్లు అర్జున్‌ అభినందనలు తెలిపారు..