త్రిష రేంజే వేరు!

Trisha3
Trisha

త్రిష రేంజే వేరు!

త్రిష కెరియర్‌ ముగిసినట్టేనని ఇప్పటికి చాలాసార్లు అనుకున్నారు. ఒక టైమ్‌లో ఇక సినిమాలకి స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుందామని కూడా అనుకుంది. ఆ పెళ్లి కాన్సిల్‌ అయిన తర్వాత ఇక త్రిష కెరియర్‌ ముందుకి సాగుతుందా అంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ తమిళనాట తను క్వీన్‌ అని త్రిష మళ్లీ చాటుకుంటోంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలున్నాయి.
వాటిలో తనే ప్రధాన పాత్ర చేస్తోన్న సినిమాలు మూడు వరకు వున్నాయి. స్టార్‌ హీరోల చిత్రాల్లో ఈమధ్య అవకాశాలు తగ్గిన మాట నిజమే అయినప్పటికీ త్రిషకి వున్న డిమాండ్‌ అయితే ఏమీ తగ్గలేదు. సతురంగ వేట్టా§్‌ు 2, మోహిని, గర్జనై, 1818, 96… ఇలా ఎటు చూసినా త్రిషే కనిపించబోతోంది. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ తమిళ చిత్ర సీమలో మాత్రం ఆమెకి ఎదురు లేదని ఈ సినిమాల లిస్టే చెబుతోంది. మలయాళంలోను అడుగు పెడుతోన్న త్రిష ఇప్పట్లో సినీ రంగం నుంచి బయటకి వెళ్లేట్టు కనిపించడం లేదు. ముప్ప§్‌ు అయిదుకి దగ్గర పడుతోన్నా తన డిమాండ్‌ ఏమీ తగ్గకపోవడం మిగతా హీరోయిన్లకి కంటగింపుగానే వుంటుంది.