తొలికిరణం డేట్‌ ఫిక్స్‌

TOLIKIRANAM1
TOLIKIRANAM1

తొలికిరణం డేట్‌ ఫిక్స్‌

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌ తో నిర్మించిన క్రైస్తవ ఆధ్యాత్మిక చిత్రం తొలికిరణం. ఈ చిత్రాన్ని డిసంబర్‌ 23న ప్రప్రచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు జె.జాన్‌ బాబు తెలిపారు. జీసస్‌ జీవితంలో ఇంతవరకు స్మసించని కొత్త కోణంలో చారిత్రక ఆధారాలతో ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను అనేక శ్రమల కూర్చి నిర్మించినట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. చాలా సంవత్సరాల తరువాత ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న క్రైస్తవ ఆధ్యాత్మిక చిత్రం కావడంతో ఈ సినిమాపై క్రైస్తవులే కాకుండా ఇతర వర్గాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తి మరింత బాధ్యత పెంచిందని దర్శకుడు తెలిపారు. సువర్ణ క్రియేషన్స్‌ పై పి.డి.రాజు, అభినయ, మౌనిక ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి కథ-పాటలు: రెవరెండ్‌ టి.ఎ. ప్రబుకిరణ్‌, రచన సహకారం:వి.ఎం.ఎం.ప్రవీణ్‌, సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌, కెమెరా: మురళీకష్ణ, ఎడిటింగ్‌: విన§్‌ు, నిర్మాత: టి.సుధాకర్‌, wస్కీన్‌ ప్లే-దర్శకత్వం: జె.జాన్‌ బాబు.