తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు

TS Film chanber met with talasani
TS Film chanber met with talasani

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు

చిన్న సినిమాలకు ప్రత్యేకంగా 5వ షోని ప్రకటించిన తెలంగాణప్రభుత్వానికి ధన్యవాదాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌, అన్నారు.. మంత్రి తలసాని యాదవ్‌ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.. నిర్మాత సాయి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో ఆర్‌కె గౌడ్‌ మాట్లాడారు.. తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్‌ ఇండస్ట్రీకి సంబంధించి పెండింగ్‌ సమస్యలను పరిష్కారం చూపుతోందన్నారు.. అలాగే సింగిల్‌ విండో పద్దతిలో సినిమా షూటింగ్‌లకు పర్మిషన్లు , ఎఫ్‌డిసి ద్వారా ఇవ్వటం మంచి పరిణామని అన్నారు.. అలాగే చిన్న సినిమాకు తప్పకుండా థియేటర్‌లో నాలుగు షోలు నడుస్తున్నాయని, ఇపుడు మరో షో పెంచటం ద్వారా చిన్న సినిమాలకు అవకాశం కలుగుతుందన్నారు..