డ్రెసింగ్ ఖరీదు జస్ట్ 720 డాలర్లు

KAREENA KAPOOR
KAREENA KAPOOR

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. తను ప్రసవించిన 9 నెలల సమయానికే మళ్లీ స్లిమ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇంతగా మళ్లీ తన పాత లుక్ లోకి వచ్చేయడానికి కారణం వర్కవుట్స్. జిమ్ లో విపరీతంగా శ్రమించి తన ఫిజిక్ ను తిరిగి తెచ్చుకోగలిగింది బెబో. అదే ట్రెండ్ ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ.. వర్కవుట్స్ ను కొనసాగిస్తోంది కరీనా. అలాగే ఓ ఫిట్నెస్ సెషన్ కు వెళ్లే సమయంలో ఈ బ్యూటీ వేసుకున్న డ్రెసింగ్ డీటైల్స్ తెలిసి అందరూ ఔరా అనుకుంటున్నారు. గుస్సి టై-డైడ ఏసీ/డీసీ టీ-షర్ట్ ను ధరించింది కరీనా కపూర్.

ప్రస్తుతం అబ్రాడ్ లోనే అందుబాటులో ఉన్న ఈ మోడల్ ఖరీదు జస్ట్ 720 డాలర్లు మాత్రమే. డాలర్ కు 66 రూపాయల లెక్కన ఇండియన్ రూపీస్ లో దీని ఖర్చు ఎంత అవుతుందో మీరే లెక్క పెట్టుకోండి. కేవలం జిమ్ కు వెళ్లేందుకే ఇంత ఖరీదైన డ్రెస్ వేసుకుంటే.. ఇక ఈ సీనియర్ అమ్మడు ఇక ఫ్యాషన్ వేర్- మోడర్న్ డ్రెసింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తుందో అని ఆలోచించడానికి కూడా కొంచెం భయమేస్తుంది కదూ.