డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో..

keerthi suresh
keerthi suresh

తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న హీరోయిన్‌ కీర్తిసురేష్‌. నటనకు ఆస్కారమున్న పాత్రల్ని ఎక్కువగా ఎంచుకునే ఈమె ప్రస్తుతం తమిళంలో స్టార్‌హీరో సూర్య సరసన ‘ తాన సెరెంద కూట్టం అనే సినిమాలో నటిస్తోంది.ఈచిత్రం తెలుగులో ‘గ్యాంగ్‌ పేరుతో రిలీజ్‌ కానుంది. ఈచిత్రంలో ఈమె ఒక సంప్రదాయకమైన బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కన్పించనుందట. ఇందులో విశేషం ఏమిటంటే ఈమె పాత్రకు సినిమాలో అసలు ఖచ్చితమైన పేరే ఉండదట. అంతేకాక ఆమె పాత్రలో మంచి ఫన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయని టాక్‌. ఈనెల 12న తమిళంతోపాటు తెలుగులో కూడ విడుదల కానున్న ఈచిత్రాన్ని యువి క్రియేషన బ్యానర్‌ సమర్పిస్తోంది. విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.