‘టూ కంట్రీస్‌’ ఆడియో వేడుక

two country,s
two country’s

మహాలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌పై దర్శకుడు ఎస్‌శంకర్‌ స్వీయ దర్శక నిర్మాణంలో సునీల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం’ టూ కంట్రీస్‌ గోపీసుందర్‌అందించిన ఆడియోను హైదరాబాద్‌లో విడుదలచేశారు. హీరో నాని ఆడియో సిడిలను ఆవిష్కరించారు. ఆనంతరం నాని మాట్లాడారు. సునీల్‌ అన్నతో హీరోకాక ముందు నుంచి పరిచయం ఉందన్నారు. ఈ చిత్రం కంటెంట్‌ఆల్‌రెడీ ప్రూవ్‌ చేసుకున్న కంటెంట్‌ అన్నారు. ఇక కామెడీ పరంగా సునీల్‌ చూసుకుంటారన్నారు. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందన్నారు. హీరో సునీల్‌ మాట్లాడుతూ, శంకర్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించారన్నారు. గోపీసుందర్‌ అద్భుతమైన సంగీతం అందించారన్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనఆనరు. కార్యక్రమంలో వీర శంకర్‌, అనిల్‌ రావిపూడి, దశరధ్‌, శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, బివిఎస్‌ రవి, వెంకీ కుడుముల, ఇ.సత్తిబాబు, విఎన్‌ ఆదిత్య, సురేష్‌కొండేటి, పృధ్వీ, నందిని సిధారెడ్డి, భాస్కరభట్ల,శ్రేష్ట, దేదివ్య, వైష్ణవి , మేఘాంశ్‌ తదితరులు మాట్లాడారు.