టెన్షన్లు..ప్రయాణం నటుడికి సర్వసాధారణం

NA NUVVE
NA NUVVE

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో కూల్‌బ్రీజ్‌ సినిమాస్‌ నిర్మాణంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ , తమన్నా జంటగా నటించిన చిత్రం నా నువ్వే.. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్‌ ముప్పవరపు విజయ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు.. ఈసినిమా జూన్‌ 14న విడుదలకాబోతోంది.. ఈసందర్బంగా ప్రీరిలీజ్‌ వేడుకకు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ముఖ్యఅతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదలచేశారు.
ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, నాన్నకు ప్రేమతో సినిమాచేసే సమయంలోకొత్త గెటప్‌ చేశానని, అప్పటి వరకు నేను చేసిన సినిమాలను దృష్టిలోపెట్టుకుని ఈచిత్రాన్ని యాక్సెప్ట్‌ చేస్తారా లేదా అనుకున్నానని, ఎందుకంటే ప్రతి నటుడు స్టీరియో టైప్‌ సినిమాలు చేసుకుంటూ వెళితే.. ఆ హీరో సినిమాలు చేసే ప్రేక్షకులకు ఆసక్తి ఉండదన్నారు. సాధారణంగా సినిమా పెద్ద హిట్‌అయ్యిందనే దానికంటే ఆ నటుడు చక్కగా నటించాడనే అప్రీసియేషన్‌ ఎంతోముఖ్యం అన్నారు. ఆ రోజు నాన్నకు ప్రేమతో సినిమా చేసేటపుడు నేనెలా ఫీలయ్యానో అన్నయ్య ముఖం చూస్తుంటే అలాగే కన్పిస్తోందన్నారు.. కానీ తప్పదు ఈ టెన్షన్లు,, ప్రయాణం నటుడికి సర్వసాధారణం అన్నారు నిజంగా కష్టపడతే ఆ చిత్రానికి పెద్దపీట వేయటమనేది తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తేమీ కాదన్నారు. అలాంటిచిత్రాలకుచెందిన కోవలో నా నువ్వే కూడ నిలస్లుందని నా ప్రగాఢ నమ్మకం అన్నారు.