టిఎస్సార్‌-టీవి 9 అవార్డ్స్‌ విజేతలు!

TSR1
TSR1

టిఎస్సార్‌-టీవి 9 అవార్డ్స్‌ విజేతలు!

రాజకీయవేత్త, కళాబంధు టి. సుబ్బరామి రెడ్డి గురువారం హైదరాబాద్‌ లో టిఎస్సార్‌-టీవి 9 నేషనల్‌ అవార్డ్స్‌ ను ప్రకటించారు. ఇందులో 2015, 2016 సంవత్సరాలకు గాను విజేతలను ప్రకటించారు. ముందుగా 2015 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా వెంకటేష్‌ (గోపాల గోపాల), ఉత్తమ హీరోగా అల్లు అర్జున్‌ (సన్‌ అఫ్‌ సత్యమూర్తి), ఉత్తమ దర్శకుడిగా గుణశేఖర్‌, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ, ఉత్తమ హీరోయిన్‌ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఉత్తమ చిత్రంగా కంచె, ఉత్తమ విలన్‌ గా ముఖేష్‌ రిషి, ఉత్తమ సహాయ నటిగా నదియా (బ్రూస్లీ), ఉత్తమ కమెడియన్‌ గా అలీ(సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి), ఉత్తమ డెబ్యూ హీరోయిన్‌ గా ప్రగ్య జైస్వాల్‌ (కంచె), ఉత్తమ డెబ్యూ హీరోగా ఆకాష్‌ పూరి (ఆకాష్‌ పూరి) లకు అవార్డులు దక్కాయి.

ఇక 2016 సంవత్సరానికి గాను ఉత్తమ హీరోగా బాలక్రిష్ణ (డిక్టేటర్‌), ఉత్తమ నటుడిగా నాగార్జున (సోగ్గాడే చిన్ని నాయన), ఉత్తమ చిత్రంగా ఊపిరి, స్పెషల్‌ జ్యూరీ బెస్ట్‌ యాక్టర్‌ గా రామ్‌ చరణ్‌, పాపులర్‌ ఛాయిస్‌ హీరోగా నాని, ఉత్తమ నటిగా రకుల్‌ ప్రీత్‌, ఉత్తమ్‌ హీరోయిన్‌ గా క్యాథరిన్‌ థ్రెస, బెస్ట్‌ డెబ్యూ హీరోయిన్‌ గా నివేత థామస్‌, ఉత్తమ దర్శకుడిగా సురేందర్‌ రెడ్డి, ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్‌ ఎంపిక కాగా నేషనల్‌ స్టార్‌ అవార్డు ప్రభాస్‌ (బాహుబలి), స్పెషల్‌ జ్యూరీ అవార్డు ఫర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ రానా (బాహుబలి),స్పెషల్‌ అప్రిసియేషన్‌ హీరో అవార్డు నాగ చైతన్య (ప్రేమమ్‌) కు దక్కించుకున్నారు. ఈ నెల 8వ తేదీన వైజాగ్‌ లోని పోర్ట్‌ స్టేడియంలో ఘనమైన వేడుక నిర్వహించి ఈ అవార్డులను ప్రదానోత్సవం చేయనున్నారు.