ఛార్మికి గాయం!

charmi
చార్మీ కౌర్‌ కాలికి దెబ్బ తగిలింది. అది కూడా ఏ చిన్న.. చితకో కాదు. మోకాలి నుంచి కింది వరకూ కట్టు కట్టి.. పూర్తిగా రెస్ట్‌ తీసుకునేంత. కాలు కింద పెట్టి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సినిమా కనపడుతోంది. దానికి కారణం ఎవరు? లాంటి ప్రశ్నలకు చార్మీ బదులిచ్చింది.విషయం ఏమిటంటే.. అనేకుడు హీరోయిన్‌ అమైరా దస్తర్‌ ఉంది కదా? ఆ భామ చార్మీకి మంచి స్నేహితురాలు. ముంబయికి చెందిన ఈ భామకు సిటీ చూపిద్దామని బయటకు తీసుకెళ్లి తర్వాత ఆమె రూమ్‌ కి వెళ్లింది. కుర్చీలో కూర్చునే సమయంలో స్లిప్‌ అయి కిందకు పడబోయింది. పడిపోతున్న చార్మీని పట్టుకున్న అమైరా బ్యాలెన్స్‌ తప్పి ఇద్దరూ కింద పడ్డారు. కాలికి కాస్త దెబ్బ తగిలినట్లు అనిపించి.. గాయానికి మందురాసి పడుకుందట. పొద్దున్నే నిద్ర లేచేసరికి కాలు వాచిపోయి.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. దీంతో.. డాక్టర్‌ దగ్గరకు వెళితే కట్టు కట్టి రెస్ట్‌ తీసుకోవాలని చెప్పారంటూ అసలు విషయాన్ని బయట పెట్టారు.