చిరు లాంచ్‌ చేసిన మా డైరీ!

MAA DAIRY REALEASE
MAA DAIRY REALEASE

చిరు లాంచ్‌ చేసిన మా డైరీ!

 

మూవీ ఆర్టిస్టుల సంఘం అధికారిక డైరీ మా డైరీ-2017 ని మెగాస్టార్‌ చిరంజీవి ఆవిష్కరించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్‌ స్వగృహంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 150 గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛాన్ని మెగాస్టార్‌ చిరంజీవికి మా అధ్యక్షకార్యదర్శులు అందించారు. అనంతరం మెగాస్టార్‌ మా డైరీని ఆవిష్కరించారు. మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి శివాజీరాజా సారథ్యంలోని టీమ్‌ ఎన్నో మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకుంటోంది. రాజేంద్రుడు ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘మా’ బాధ్యతల్ని చక్కగా నెరవేరుస్తున్నారు. ఆర్టిస్టుల్లో ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా మాని నడిపిస్తున్నారు. అంతా గర్వించేలా చేస్తున్నారు. ఇంకా ఇంకా మంచి పనులెన్నో చేయాలి. కళామతల్లి ముద్దుబిడ్డలుగా నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు మైమరిచిపోతున్నా. మీరంతా గర్వించేలా.. ఇదిరా చిరంజీవి అనేలా సినిమా ఇస్తాను. ది బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ని ఇస్తాను. ఖైదీ నంబర్‌ 150 ప్రతి ఒక్కరినీ అలరించే చిత్రమవుతుంది అన్నారు. డా.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. మా అసోసియేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా చేస్తున్నందుకు ‘మా’తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నారు