చిన్నకాఫీ కప్పుతో పెద్ద చర్చే ..

RITIKA--
RITIKA

చిన్నకాఫీ కప్పుతో పెద్ద చర్చే 

‘గురు చిత్రంలో వెంకటేష్‌ లాంటి సీనియర్‌ హీరో ముందు ఏ మాత్రం బెరుకులేకుండా స్టూడెంట్‌ పాత్రలో మెప్పించి ఒప్పించింది రతిక సింగ్‌.. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుతోపాటు పలు అవార్డులు సొంతం చేసుకుంది కూడ.. కెరీర్‌ పరంగా యాక్టివ్‌గా ఉంటూ సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటోంది.. తన సరదా అనుభవాలు, రొటీన్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌షేర్‌ చేసుకుంటూ ఉంటుంది.

ఫొటో చూశారుగా.. అంత దిగాలుగా ఎందుకు కూర్చుంది అని డౌట్‌ రావటం సహజం,. దానికోరీజన్‌ ఉంది.. అదే రితికా స్వయంగా చెప్పింది కూడ.. తాగాలను కున్న కాఫీ వేడిగా లేకపోవటంతో కాసేపు దాన్ని మైక్రో వేవ్‌ ఓవెన్‌లో పెట్టిన అమ్మడు. తీరా బయటకు తీస్తే అవసరానికి మించి వేడిగా ఉండటంతో ఎలా తాగాలో అర్ధం కాక ఇలా ఫోజిచ్చి తన ట్విట్టర్‌లోషేర్‌ చేసుకుంది..

కామెంట్స్‌లో మాత్రం అభిమానులు కాఫీని పట్టించుకోంకుండా రితిక అందాన్ని పొగుడుతూ తన ప్లస్‌ పాయింట్‌ అయిన ఉంగరాల రింగు జిట్టు గురించి వర్ణిస్తూ కాసేపయ్యాక కాఫీ తాగమని సలహా ఇచ్చారు. మొత్తానికి చిన్నకాఫీ కప్పుతో పెద్ద చర్చే చేయించింది అమ్మడు. అదీ సంగతి. ప్రస్తుతం అమ్మడు ‘వనంగముడి అనే సినిమాలో అరవింద్‌స్వామితో నటిస్తోంది. సెల్వ దర్శకుడు ఆగస్టులో విడుదల కానుంది.