‘చిత్రలహరి’ కోసం..

sunil
sunil

మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ప్రముఖ హాస్యనటుడు , హీరో సునీల్‌ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈచిత్రం డబ్బింగ్‌ కార్యక్రమాలను మొదలు పెట్టారు.. సునీల్‌ ఈచిత్రంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ చెబుతున్నారు.. ఈసినిమాలో సాయిధరమ్‌తేజ్‌ సరసన కళ్యాణి ప్రియదర్శన్‌ నటిసోతంది.. చిత్ర పాత్రలో ఆమె కన్పించనుంది.. మరో హీరోయిన్‌ నివేత పేతురాజ్‌ లహరి పాత్రలో నటిసోతంది.. ఈచిత్రం ఏప్రిల్‌ 12న విడుదల కానుంది.. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.