‘చలో’ సెకండ్‌ సాంగ్‌ రిలీజ్‌

chalo
chalo

శంకర ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స బ్యానర్‌పై నాగశౌర్య, రషిత్మ మండన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘ఛలో. వెంకీ కుడుముల దర్శకుడు. ఉషా మూల్పూరి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి2న విడుదల అవుతోంది. కొత్త సంవత్సరం
సందర్భంగాయూనిట్‌ సినిమాలోని సెకండ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. సీనియర్‌ పాత్రికేయుడు పసుపులేటి రామారావు , బిఎ రాజు, సాంగ్‌ను విడుదల చేశారు. పసుపులేటి మాట్లాడుతూ, సాంగ్‌ చాలా బాగుందని, పెద్దహిట్‌ కావాలని కోరుకుంటున్నాని అన్నారు. బిఎ రాజు మాట్లాడత, ఈ ఏడాది 2008కి ఛలో సినిమా స్వాగతం పలుకుతుందన్నారు. ఆల్‌రెడీ విడుదలైన ఫస్ట్‌సాంగ్‌ పెద్దహిట్‌ సాధించి మంచి పేరు తెస్తుందన్నారు. సీనియర్‌ నటుడు నరేష్‌మాట్లాడుతూ, టాలీవుడ్‌లో గోల్డెన్‌ ఎరా స్టార్ట్‌ అయ్యిందన్నారు. అందరూ టాలీవుడ్‌వైపు ఆసక్తిగా గమనిస్తున్నారన్నారు. స్క్రిప్టు విన్నపుడే సినిమా పెద్దహిట్‌ అవుతుందని చెప్పానని అనఆనరు. చిత్ర సమర్పకుడు శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి మాట్లాడత, ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని, మాసినిమా ఛలోను ఫిబ్రవరి 2న గ్రాండ్‌ లెవల్‌లో విడుదల చేయనున్నామన్నారు.దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, ఫస్ట్‌సాంగ్‌కు మేం ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్‌ వచ్చిందన్నారు.