చరణ్‌ సినిమాలో అనుపమ!

Anupama1
Anupama Parameswaran

చరణ్‌ సినిమాలో అనుపమ!

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తదుపరి సినిమా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులో చరణ్‌ సరసన కథానాయికగా రాశి ఖన్నాను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్‌ పేరు వినిపిస్తోంది. దాదాపు ఆమె ఎంపిక ఖరారైనట్టేనని చెబుతున్నారు. అయితే ఆమె మొదటి కథానాయికనా.. రెండవ కథానాయికనా అనే విషయం తెలియాల్సి వుంది. అ ఆ సినిమాలో పల్లె పిల్లగా కనిపించిన అనుపమ .. శతమానం భవతి లోను అదే తరహా పాత్రలో కనిపించనుంది. చరణ్‌ సినిమాలోనూ ఆమె పల్లెటూరి పిల్లగా కనిపించనుండటం విశేషం. ఈ సినిమాతో అనుపమ తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి!