క్విన్ ఈజ్ బ్యాక్..కమింగ్ సూన్

UDAYA BHANU
UDAYA BHANU

క్విన్ ఈజ్ బ్యాక్..కమింగ్ సూన్ 

ఒకప్పుడు బుల్లితెరపై తనదైన శైలిలో యాంకర్ గా మోస్ట్ పాపులర్ అయిన సెలబ్రెటీ ఉదయభాను. సినిమా ఇండస్ట్రీలో ఏ వివాదాలు లేకుండా తనదైన శైలిలో కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకున్న ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి ట్విన్స్ కి జన్మనిచ్చి వారితోనే కాలాన్ని గడిపింది.
అయితే ఆమె మళ్లీ తన గత వైభవాన్ని చూపెట్టబోతున్నట్లు ఇన్ని రోజులు వస్తున్న రూమర్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన ఉదయభాను త్వరలో స్టార్ మా స్టార్ట్ చేయబోయే ”నీతోనే అనే డాన్స్” షో లో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ” భాను ఈజ్ బ్యాక్” అంటూ ఇప్పుడు మా టివి వారు రిలీజ్ చేసిన వీడియో బిట్ ఒకటి ట్విట్టర్లో చెక్కెర్లు కొడుతుంది. అలాగే క్విన్ ఈజ్ బ్యాక్..కమింగ్ సూన్ అని కూడా ట్వీట్స్ పడుతున్నారు. అయితే ఈ షోలో ఆమె యాంకర్ గా చేయనుందా లేదా డ్యాన్సర్ గా థ్రిల్ చేయనుందా అని అప్పుడే నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఎలాగైతే ఏంటి? మొత్తానికి ఉదయ భాను తమ అల్లరి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోందని తెలిసిపోయింది.