క్లారిటీ వచ్చేసింది

rakul preet singh
rakul preet singh

సౌత్‌లో నార్త్‌భామలు మంచిక్రేజ్‌ అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంఓల వారికి ఏకంగా మలయాళీ ముద్దుగుమ్మల నుంచి పోటీ తీవ్రత ఎక్కువ అవుతోంది. నార్త్‌స్టార్‌ హీరోయిన్స్‌ ఆఫర్స్‌ చివరి నిముషంలో లాగేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా ప్రస్తుతం ప్రేమమం భామలు చాలా భయపడుతున్నారట. అనుపమ పరమేశ్వరన్‌, సాయిపల్లవి పేర్లుబాగా విన్పిస్తున్నాయి. ఇక అసలు విషయానికొస్తే. ఇటీవలే సాయిపల్లలి, రకుల్‌ప్రీత్‌సింగ్‌ చాన్సుకే టెండర్‌ పెట్టిందని అంటున్నారు. మొత్తానికి చివరి నిమిషంలో ఆ బ్యూటీ రకుల్‌ ఆఫర్‌ను కొట్టేసిందని అంటున్నారు. సెల్వా రాఘవన్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో ముందు నుంచి రకుల్‌ పేరు విన్పిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల ఆమె స్థానంఓల సాయిపల్లవి పేరు విన్పిస్తోంది. కాగా రీసెంట్‌గా కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌ నీరజా కోన ట్వీట్‌ని బట్టి చూస్తే ఆ సినిమాలో రకుల్‌ స్థానం అలాగే ఉందని తెలుస్తోంది. సనిమాలో రకుల్‌తోపాటు సాయిపల్లవి కూడ నటిస్తుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈసినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభ కానుందట.