కొడుకు పుట్టాడు..

manchu vishnu family
manchu vishnu family

హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యారు. సోమవారం సాయంత్రం మంచు విష్ణు భార్య విరోనిక మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కుమారులను కలిగిన విష్ణు ఈసారి కూడ తనకు ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటున్నట్టు సోషల్‌ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ చాలా మంది తనకు కొడుకు పుడితే వారసుడంటాడని సన్నిహితులు చెప్పారు. వాళ్లందరికీ తను సమాధానం ఇస్తూ. ‘నాకు ఇద్దరు వారసురాళ్లు ఉన్నారు. ఆరియానా, వినియానా, ఇంకొఅమ్మాయి పుడితే మూడో వారసులరాలు అవుతుంది. అబ్బాయి పుడితే వారసుడు అవుతాడు. వారసత్వానికి అమ్మాయి, అబ్బాయి తేడాలేదని తెలిపిన సంగతి తెలిసిందే.