ఏప్రిల్‌ మూడోవారంలో ‘దిక్సూచి

dileep kumar
dileep kumar

దిలీప్‌కుమార్‌ సల్వాది హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రాబోతున చిత్రం దిక్సూచి.. డివోషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని బేబీ సనిక సాయి శ్రీరాచూరి సమర్పిస్తున్నారు..శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.. ఏప్రిల్‌ మూడోవారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఆడియోను దిక్సూచి మ్యూజిక్‌ అనేయాప్‌ ద్వారా విడుదల చేశారు.. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో యూనిట్‌ సభ్యులు హాజరయ్యారు.. దర్శకుడు, హీరో దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ, ఈచిత్రం 1970 బ్యాక్‌డ్రాప్‌లో సెమీ పీరియాడిక్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతోందన్నారు. అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయన్నారు.. రెండుగంటలపాటు అందరినీ ఆనందింపజేసేలా ఉంటుందన్నారు. నిర్మాత నరసింహరాజు మాట్లాడుతూ, కంటెంట్‌ ఉన్న సినిమా అన్నారు.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండవని తెలిపారు.. అందుకే ఈచిత్రాన్ని నిర్మించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో నటుడు అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు